Saturday, September 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్‌ రాజీనామా చేయాలి: పొన్నం ప్రభాకర్‌

కేసీఆర్‌ రాజీనామా చేయాలి: పొన్నం ప్రభాకర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించకుండా పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజీనామా డిమాండ్‌తో ఈనెల 6న ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించిన పొన్నం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -