- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం శనివారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావు భార్యను స్థానిక జాలర్లు రక్షించగా, శ్రీనివాసరావుతో పాటు కుమారుడు, కుమార్తె గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలోకి చేరిన శ్రీనివాసరావు భార్య పద్మినిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించగా మెరుగైన చికిత్సకోసం తణుకుకు తరలించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
- Advertisement -


