Saturday, September 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ, బీమా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న అధికారుల కమిటీ కొత్త ఛార్జీలను ప్రతిపాదిస్తూ రవాణాశాఖకు నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కమిటీ సిఫార్సుల ప్రకారం ఆటోలో కనీస ఛార్జీ 1.6 కిలోమీటర్లకు రూ.30గా నిర్ణయించాలని సూచించింది. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేయాలని ప్రతిపాదించింది. ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో నిమిషానికి 75 పైసలు వెయిటింగ్‌ ఛార్జీగా తీసుకోవాలని, రాత్రి వేళల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఆటో, యాప్‌ ఆధారిత వాహనాల యూనియన్ల డిమాండ్ల నేపథ్యంలో అధికారులు కేరళ, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో అమలవుతున్న ఛార్జీలను అధ్యయనం చేశారు. డ్రైవర్ల నిర్వహణ వ్యయం, ఇంధన ధరలు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -