నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ సెంచరీతో కదం తొక్కాడు. నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో లుహన్ డ్రీ ప్రిటోరియస్ కేవలం 53 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం నమోదు చేసింది. ప్రిటోరియస్ తన సెంచరీతో రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు. 20 ఏండ్ల 161 రోజుల వయసులోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను ఆఫ్ఘన్ బ్యాటర్ హజ్రతుల్లా జాజాయ్ రికార్డును బ్రేక్ చేశాడు. హజ్రతుల్లా 20 ఏండ్ల 337 రోజుల వయసులో ఐర్లాండ్‌పై సెంచరీ కొట్టాడు. చిన్న వయసులోనే సెంచరీ కొట్టి రికార్డు ప్రిటోరియస్ పేరిట నమోదు కావడంతో.. ఇక భారత బ్యాటర్ సూర్యవంశీకి అది సవాల్‌గా మారనున్నది. ఇప్పటికే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేయాలన్న కాంక్షతో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



