- Advertisement -
నవతెలంగాణ- భిక్కనూర్
మండలంలోని ఇసన్నపల్లి గ్రామాన్ని ఎంపీడీవో సవితారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ జీపీ రికార్డులు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న ఈజీఎస్ పనుల పురోగతిని ప్రత్యక్షంగా చూశారు. పనుల నాణ్యతపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారయణ, పంచాయతీ కార్యదర్శి సుమేద రెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



