Saturday, September 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని మృతి

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎయిర్‎పోర్టు ఉద్యోగిని అక్కడికక్కడే మరణించింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. రాధిక అనే మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. రోజువారీ విధుల్లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 5) స్నేహితుడితో కలిసి బైక్‎పై డ్యూటీకి వెళ్తుంది. 

ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీ కారు వీరు ప్రయాణిస్తోన్న బైకును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన  రాధిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్నేహితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

 చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలను గుర్తించిన పోలీసులు.. ట్యాక్సీ కారు నడిపిన ఉమాకాంత్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -