Saturday, September 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంత్రిశూలి-1 సొరంగం.. మరో ఇద్దరు వెలికితీత..వీడియో

త్రిశూలి-1 సొరంగం.. మరో ఇద్దరు వెలికితీత..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌ అపర్ త్రిశూలి 1′ ప్రాజెక్ట్ సొరంగం నుండి మరో ఇద్దరు వ్యక్తులను విపత్తు దళాలు రక్షించాయి. ఒక విదేశీయుడితో పాటు నువాకోట్ ప్రాంతం నుండి ఒక మహిళను కూడా రక్షించాయి. ఈ వివరాలను నేపాల్ సైన్యం ‘X’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. శుక్రవారం ప్రాజెక్ట్ టన్నెల్‌లో తొమ్మిది రోజుల పాటు చిక్కుబడిన ఇద్దరు కార్మికులను సహాయ సిబ్బంది రక్షించారు. ఆగస్టు 26న నేపాల్‌లో హిమానీనదం (glacier) విరిగిపడడంతో సంభవించిన వరదలకు పలు గ్రామాలు, ఇళ్లు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో పెను విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 1300 మందికి పైగా మృతి చెందగా.. 5000 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -