నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ దేశాలు పలు రోజుల నుంచి పరస్పరం డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ లో అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్ , జారెడ్ కుష్నర్‌ల పర్యటన నేపథ్యంలో కీవ్‌పై రష్యా దాడులను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉక్రెయిన్ రాజధానిపై దాడులకు దూరంగా ఉండాలని రష్యా బలగాలను ఆదేశించినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఉక్రెయిన్‌కు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారుల కీలక పర్యటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రష్యా కీలక నిర్ణయం..మూడు రోజులు సీజ్ ఫైర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



