Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే

విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బిజ్జలవాడి గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలలో విద్యాభివృద్ధి జరిగినప్పుడే ఆర్థికంగా దేశం ఎదుగుతుందని అన్నారు. విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించినప్పుడే అనుకున్న లక్ష్యాలను నెరవేరతాయని చెప్పారు. గత కొన్నేండ్లుగా శిథిలావస్థలతో ఉన్న పాఠశాల భవనం స్థానంలోనే రూ. 25 లక్ష‍ల నిధులతో నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాబాయి , ఎంఈఓ తిరుపతయ్య,  ఉపసర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కుమార్, టీచర్ శోభ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -