- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడుగూరు గ్రామంలో శనివారం ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాన్ని ఆ గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ఆధ్వర్యంలో బీఎల్ఓ లు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ తగిన ఆధారాలు అందజేసి ఓటు నమోదుకు సహకరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఆర్ నోటీసులను సర్పంచ్ గ్రామస్తులకు అందజేశారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ ఓటర్ నమోదు సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
- Advertisement -



