నవతెలంగాణ – మల్హర్ రావు
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను విస్మరించింది బిఆర్ఎస్ పార్టీనేని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ తోపాటు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ చేసిన నిరాదారమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శనివారం కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాజకీయ ఉనికి కోసం బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో మంథని నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక పుట్ట మధు అసత్య ప్రచారాలు దిగుతున్నారని, పేర్కొన్నారు. హత్యలు, బెదిరింపులు, భయాందోళనల రాజకీయాలకు మంథని ప్రజలు ఎన్నడూ చరమగీతం పాడారని ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రజాసేవలా రాజకీయాలకే మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. అభివృద్ధి,సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


