– పామాయిల్ మొక్కల పంపిణీ
– రైతులతో ముఖాముఖి
– ఆయిల్ ఫెడ్ డీఓ శంకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం లోని టీజీ ఆయిల్‌ఫెడ్ పామాయిల్ డివిజన్ కార్యాలయం, ఆయిల్ ఫామ్ నర్సరీలో ఆదివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులు మీదుగా రైతులకు పామాయిల్ మొక్కల పంపిణీ చేపట్టనున్నట్లు ఆయిల్ ఫెడ్ డీఓ శబావత్ శంకర్ తెలిపారు.
ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట,సత్తుపల్లి ఎమ్మెల్యే లు జారే ఆదినారాయణ,డాక్టర్ మట్టా రాగమయి లు పాల్గొంటారని తెలిపారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి, నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించ నున్నట్లు వివరించారు. తొలి విడతలో 1,59,000 మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని,దశలవారీగా మొత్తం 19,344.04 ఎకరాల్లో సాగుకు 11,02,610 మొక్కలను రైతులకు అందించనున్నట్లు తెలిపారు.



