Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభీంగల్ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్‌గా బోదిరే నాగమణి

భీంగల్ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్‌గా బోదిరే నాగమణి

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుండి కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భీంగల్ మున్సిపల్ చైర్మన్ గా బోదిరే నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ‌ ఉదయం క్యాంపు నుండి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీంగల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గా 6 వ వార్డు కౌన్సిలర్ బోదిరే నాగమణి, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ సంటి లతను ఎన్నుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం బోదిరే నాగమణి(స్వామి) చైర్ పర్సన్ గా, సంటి లతా (జేజే నర్సయ్య) వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగుతామని సీఐ తెలిపారు. మొదటి మూడు ఏండ్లు చైర్మన్ గా బోదిరే నాగమణి, చివరి రెండేండ్లు చైర్మన్ గా ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ నాగేంద్ర, వైస్ చైర్మన్ గా మొదటి రెండేండ్లు సంటి లత, చివరి మూడేండ్లు రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత పదవి కాలం చేసేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -