Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేయర్‌ ఏకగ్రీవంగా ఎన్నిక నగర అభివృద్ధికి సంకేతం..

మేయర్‌ ఏకగ్రీవంగా ఎన్నిక నగర అభివృద్ధికి సంకేతం..

- Advertisement -
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి:
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రపి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్ ,కార్పొరేట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

     అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు మంత్రి   శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నంత కాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు. ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల ఫ్రీ కరెంటు బిల్లు చెల్లించిందని, ఒక్కో కుటుంబానికి సుమారు 50 వేల రూపాయల వరకు కరెంటు బిల్లు భారం తగ్గించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఎంపీగా తనకు ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.అభివృద్ధి ఇప్పుడు మీ చేతుల్లో ఉందని కార్పొరేటర్లకు స్పష్టం చేశారు.

మేయర్‌తో సమన్వయం చేసుకుని నల్గొండ నగర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు. మూడేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండి, పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. తనకు పదవులు ముఖ్యమేమీ కావని, అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గెలిచిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం కృషి చేయాలని, మూడేళ్లలో నల్లగొండ కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని, వెంటనే మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ ఆఫన అలీ , నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ అమీర్, గ్రంథాల సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్ , మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -