నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై వీరోచిత పోరాటం చేసి ఇటలీ ఓడిపోయింది. 24 పరుగుల తేడాతో పరాజయం పొందింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 202 పరుగుల టార్గట్‌ను 178 పరుగులు చేసి ఆలౌటైంది. జే మాస్కో 43 పరుగులతో ఒపెనింగ్‌లో శుభారంభం ఇచ్చాడు. బీడీ మానెంటి(60) అర్ధ సెంచరీతో కదంతొక్కాడు. అదే విధంగా స్టవర్ట్ 23 బంతుల్లో 45 రన్స్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా..ఫలితం లేకుండాపోయింది. చివరి ఐదు ఐవర్లో బీడీ మానెంటి, స్టవర్ట్ ఔట్ కావడంతో ఇటలీ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 178 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లు ఓవర్ టన్, కరన్ మూడు, ఆర్చర్ రెండు వికెట్లు తీయగా, జాక్స్, రషీద్ తలా ఒక వికెట్ తీశారు.
శ్రీలంకలోని పెల్లెకలె స్టేడియంలో ఇంగ్లాండ్ టీం భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్రిటన్.. 20 ఓవర్లలకు గాను 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి ఇటలీ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. పీడీ సాల్ట్(28), బెథల్(23), టామ్ బాన్‌టన్(30), ఎస్ఎం కరన్(25), జాక్స్ (50) ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన స్కోర్ ను అందించారు. ఇటలీ బౌలర్లు కలుగమంగే, స్టీవర్ట్ 2 వికెట్లు తీయగా,మనెంటి, అలీ హసన్, స్మట్స్ తలా ఒక వికెట్ తీశారు.



