Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంజేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల..

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను మరోసారి చాటారు. జాతీయ పరీక్షల మండలి (NTA) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్ల జాబితాలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ లతో పాటు తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహీశ్వరి ఈ ఘనత సాధించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. ఎస్సీ కేటగిరిలో ఏపీకి చెందిన దేవ శ్రీవేద్ టాపర్ గా నిలిచాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -