నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్, నాగాపూర్, అమీర్ నగర్, హాస కొత్తూర్, కమ్మర్ పల్లి, బషీరాబాద్ గ్రామాల్లోని శివాలయాల్లో సోమవారం అన్న వితరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉపవాసాల విరమణ కోసం అన్న వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఉదయం ఆలయాల్లో శివయ్యను దర్శనం చేసుకొని అన్న సత్రంలో భోజనాలు చేయడం ద్వారా ఉపవాస దీక్షలు విరమించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన సత్రంలో భోజనాలు చేశారు.
మండల కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం బ్రహ్మంగారి గుట్ పైన ఉన్న శివాలయం వద్ద మాజీ సర్పంచ్ బాలేరావు మైథిలి రాజేశ్వర్ తనయుడు కోడలు బాలేరావు అభినయ వరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భోజనాలు చేశారు.ఆయా గ్రామాల్లో అన్నదాన కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



