Tuesday, June 16, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పరీక్ష‌..హెలికాప్టర్ మాక్ డ్రిల్

నీట్ పరీక్ష‌..హెలికాప్టర్ మాక్ డ్రిల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ నెల 21న దేశ వ్యాప్త‌గా నీట్ రీ-ఎగ్జామ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. లీకేజీ్ కారణంతో కేంద్ర ప్ర‌భుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌రీక్ష పేప‌ర్ సెట్ చేసిన ప్రొపెస‌ర్ల‌కు లాక్‌డౌన్ విధించారు. అదే విధంగా నీట్ ప‌రీక్ష ముగిసే వ‌ర‌కు టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ను నిలిపివేశారు. ప్ర‌శ్నపత్రాలు మళ్లీ లీక్ కాకుండా, పరీక్ష నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు, చివరి నిమిషంలో హెలికాప్టర్ల ద్వారా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాలను విమానంలో ఢిల్లీ నుంచి మదురైకి తీసుకువస్తారు. అక్కడి నుంచి, వైమానిక దళ అధికారుల రక్షణలో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్‌లో వాటిని తిరునెల్వేలి సాయుధ రిజర్వ్ గ్రౌండ్‌కు తరలిస్తారు. తాజాగా ఈ భద్రతా ఏర్పాట్లను పరీక్షించడానికి ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. NEET-UG 2026 ప్రశ్నపత్రాలను తరలించే సన్నాహాల్లో భాగంగా, తిరునెల్వేలిలోని ‘ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్’లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఒక ప్రయోగాత్మక ల్యాండింగ్‌ను చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -