Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆప్ మాజీ మంత్రి అరెస్ట్

ఆప్ మాజీ మంత్రి అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఆప్ మాజీ మంత్రి, కేజీవాల్ సన్నిహితుడు సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ ఎసీబీ అరెస్ట్ చేసింది. మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ల ఆధునికీకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సత్యేందర్ జైన్‌‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఢిల్లీ జల్ బోర్డు సీఈఓ, ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, మాజీ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవ, ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రొప్రైటర్ నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ యజమాని రాజ్‌ కుమార్ కుర్రా, శ్రీజనహార్ సంస్థ ప్రొప్రైటర్ పంకజ్ వర్మ ఉన్నారు.

ఢిల్లీలోని మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌ల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2024లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇందుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులను అధికారులు తాజాగా అరెస్టు చేశారు. సత్యేందర్ జైన్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది.గతంలో మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ 18 నెలల పాటు జైల్లో ఉన్నారు. తప్పుడు ఆరోపణలు, జైలు శిక్షలతో రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -