- Advertisement -
నవతెలంగాణ – నవాబుపేట
సమర్థవంతమైన నాయకత్వానికి చిరునామా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండల బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు అన్నారు. మంగళవారం మండల కేంద్రములోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండల మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



