Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుంగతుర్తిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

తుంగతుర్తిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
బీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో నియోజవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు హాజరై భారీ కేకును కట్ చేసి స్వీట్లు, పండ్లు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉద్యమాన్ని చేపట్టారని గుర్తు చేశారు.

పదవులను తృణప్రాయంగా త్యజించి, ఆమరణ నిరాహార దీక్ష చేసి,చావు నోటి వరకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్,సర్పంచులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి,మేడ్డుల రమేష్,చింతకుంట్ల మనోజ్, మాతంగి వెంకటమ్మ కరుణాకర్,కార్మిక విభాగం నాయకులు గౌడిచర్ల సత్యనారాయణ,గుగులోత్ ఈరోజి,మట్టపల్లి వెంకట్,వెలిశాల సరిత,గోపగాని శ్రీనివాస్ గౌడ్,తునికి సాయిలు,గోపగాని రమేష్ గౌడ్,దేవుని గుట్టతండ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుగులోత్ ఈరోజి,మండల పరిధిలోని వివిధ గ్రామాల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -