Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగాజువాకలో భారీ అగ్నిప్రమాదం..

గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో మార్కెట్ రోడ్డు అంతా గందరగోళంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ అగ్నిప్రమాద ఘటన కారణంగా కొత్త గాజువాక మార్కెట్ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -