Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేపర్ లీకేజీతో విద్యార్ధి ఆత్మహత్య ..సీపీఐ(ఎం) ఆందోళన

నీట్ పేపర్ లీకేజీతో విద్యార్ధి ఆత్మహత్య ..సీపీఐ(ఎం) ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో సీపీఐ(ఎం) నాయకులు ఆందోళన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా అను కీర్తన్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకుందని, దానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోయంబత్తూరులోని ఈఎస్ఐ ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. తగిన పరిహారం, న్యాయం లభించే వరకు ఆమె మృతదేహాన్ని స్వీకరించబోమని సీపీఐ(ఎం) ప్రకటించింది.

అను కీర్తన కోయంబత్తూరు జిల్లా టాస్మాక్ (TASMAC) ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సెంథిల్ ప్రభు కుమార్తె. ఆమె మృతదేహాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి కోయంబత్తూరు ఈఎస్ఐ (ESI) ఆసుపత్రికి తరలించి, అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం , సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా సీపీఐ(ఎం) కార్యకర్తలు తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను కొనసాగిస్తామని, విద్యార్థిని మృతదేహాన్ని స్వీకరించబోమని నిరసనకారులు స్పష్టం చేశారు.

ఈ విషాద ఘటన పట్ల ఏ మంత్రి కూడా స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు మండిపడ్డారు. అధికారులు తమతో ప్రత్యక్ష చర్చలు జరిపి, తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వరకు ఆసుపత్రి ప్రాంగణాన్ని విడిచిపెట్టబోమని నిరసనకారులు నీట్ పరీక్షా విధానంలోని లోపాల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని సీపీఐ(ఎం) సభ్యులు ఆరోపించారు. పరీక్షకు సంబంధించిన సమస్యలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యుడ, ఆయన రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యం ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -