Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆస్పత్రిలో చంద్రయ్య కుటుంబ సభ్యుల ఆందోళన 

ప్రభుత్వ ఆస్పత్రిలో చంద్రయ్య కుటుంబ సభ్యుల ఆందోళన 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
గత రెండు మూడు రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన కురిమిళ్ళ చంద్రయ్య కు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మంచినీళ్లకు బదులుగా యాసిడ్ ఇచ్చిన సంఘటనలో మంగళవారం చంద్రయ్య కుటుంబ సభ్యులు బాధితుడికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సూపరిండెంట్ శంకర్ నాయక్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ అంశంపై ఎస్సై రాంబాబు తన సిబ్బందితో ఆసుపత్రికి చేరుకొని ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ నాయక్ ను జరిగిన సంఘటనపై వివరణ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై పై అధికారులకు నివేదికను అందజేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -