నవతెలంగాణ -ముధోల్
ఇటీవలి భారీ వర్షాలు కురిసినందున దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బాసర మండలంలోని బిద్రెల్లి సమీపంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న అంతర్రాష్ట్ర రహదారిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంతమేరకు రోడ్లు దెబ్బతిన్నాయో అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రహదారులను బాగుచేయలన్నారు. అవసరమైన సూచికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.ఈ పరీశీలనలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్ అండ్ బి ఈఈ సుభాష్, తహసిల్దార్ పవన చంద్ర, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



