Friday, June 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు..యూఎస్-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా

లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు..యూఎస్-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఓవైపు ఇరాన్, అమెరికా శాంతి చర్చల ఒప్పందంపై ఏకాభిప్రాయంతో యుద్ధానికి స్వస్తి పలుకుతుంటే మరోవైపు ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేస్తూ అశాంతిని ప్రేరేపిస్తోంది. బేక వ్యాలీలో వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. ఈ దాడుల ప్రభావం యూఎస్-ఇరాన్ శాంతి చర్చల మీద పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ వేదికగా ఎంఓయూ హార్డ్‌ కాపీపై ట్రంప్‌ సంతకం చేయగా, టెహ్రాన్‌లో పెజెష్కియాన్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అమెరికా-ఇరాన్ స్వీట్జర్లాండ్ వేదికగా సదురు ఒప్పందం అధికారికంగా చర్చలు సాగించనున్నాయి. తాజాగా ఈ క్రమంలోనే స్విజ్జర్లాండ్ వేదికగా జరగాల్సిన యూఎస్-ఇరాన్ శాంతి చర్చలు వాయిదా పడనున్నాయి. లెబనాన్ పై వరుస దాడులతో ఇజ్రాయిల్ శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తోంది. లెబనాన్ పై నిరంతర దాడులు ఆపినప్పుడే శాంతి చర్చలు సజావుగా జరుగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు సంతకాల అనంతరం జరగాల్సిన సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు దేశాల మధ్య ఒప్పందం అమలులో భాగంగా 60 రోజుల కాల వ్యవధి ఉండటంతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు అవసరమని అమెరికా భావిస్తోందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ఒప్పందంలోని అంశాలు ఇవే
14 పాయింట్లతో కూడిన శాంతి ఒప్పంద పత్రాన్ని అమెరికా ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు విడుదల చేశారు. ‘అమెరికా-ఇరాన్‌ మధ్య ఇస్లామాబాద్‌ అవగాహనా ఒప్పందం’ పేరిట విడుదల చేసిన ఈ పత్రంలో హార్ముజ్‌ జలసంధిని తెరవడం, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించడం, తదుపరి సాంకేతిక చర్చలలో ఇరాన్‌ అణు కార్యక్రమం ప్రస్తావన వంటి కీలక అంశాలు ఉన్నాయి. ‘హార్ముజ్‌ను వెంటనే తెరవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అణు ధూళిని నాశనం చేయడానికి ఇరాన్‌ కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఇరాన్‌ తన సత్ప్రవర్తనను మెరుగుపరచుకుంటే దానిని మరింత సంపన్న దేశంగా మార్చగలిగిన ఆర్థిక, ఆంక్షల ఉపశమనాన్ని అందించడానికి మాకు అవకాశం ఇస్తుంది’ అని అమెరికా అధికారి తెలిపారు. ఒప్పంద పత్రంపై నేడు అధికారికంగా సంతకాలు జరుగుతాయి. ఒప్పందం యొక్క తుది నిబంధనలపై చర్చలు జరపడానికి నిర్దేశించుకున్న 60 రోజుల గడువు కూడా నేడే ప్రారంభం అవుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తుందని అమెరికా అధ్యక్షభవనం అధికారి ఒకరు చెప్పారు. ఇది ‘పనితీరు ఆధారిత’ ఒప్పందమని ట్రంప్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కాగా ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -