Thursday, August 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపెరిగిన యూనిట్రీ వాటాల విలువ

పెరిగిన యూనిట్రీ వాటాల విలువ

- Advertisement -


షాంఘై : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చైనా సంస్థ యూనిట్రీ వాటాల విలువ ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగింది. హ్యూమనాయిడ్ రోబోట్ తయారీలో ఈ సంస్థ విశేష ప్రాచుర్యం పొందింది. అమెరికాతో జరుగుతున్న టెక్ యుద్ధంలో కీలకంగా మారిన దేశీయ రోబోటిక్స్ రంగానికి యూనిట్రీ వాటాల విలువ మైలురాయి వంటి ఘట్టంగా భావిస్తున్నారు. హ్యూండాయ్ మోటార్ గ్రూప్ యాజమాన్యంలోని బోస్టన్ డైనమిక్స్‌తో పోటీపడే యూనిట్రీ తన రోబోట్‌లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంస్థకు ప్రయివేటు రంగంలోని టెక్ దిగ్గజాలు, ప్రభుత్వ రంగంలోని సంస్థల మద్దతు ఉంది. ప్రభుత్వ రంగ సంస్థగా మారిన మొదటి దేశీయ హ్యూమనాయిడ్ రోబోట్ తయారీదారు కాకపోయినా అనేక మంది దేశీయ పోటీదారులకు యూనిట్రీ రంగ ప్రవేశం మార్గదర్శకంగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -