Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'నాగబంధం`విజువల్ వండర్

‘నాగబంధం`విజువల్ వండర్

- Advertisement -

‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ సినిమాని దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించారు. విరాట్ కర్ణ హీరోగా నటించారు. ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందిం చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ, ‘జీవితంలో ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక గొప్ప విజన్‌ను ఆచరణలోకి తీసుకు రావాలంటే దాన్ని నమ్మే నిర్మాత అవసరం. మా నిర్మాత కిషోర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా తెరపై కనిపి స్తుంది. ఆర్ట్ డైరెక్టర్ అశోక్, డీవోపీ సౌందర్ రాజన్, మా ఎడిటర్‌తో పాటు ప్రతి సాంకేతిక నిపుణుడు నా విజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. వారి సహకారం లేకుండా ఈ స్థాయి సినిమా సాధ్యమయ్యేది కాదు. జూలై 3న మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమాను అందిస్తున్నామనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం మొత్తం పని తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఇందులో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కూడా మన తెలుగు టెక్నీషియన్స్ రూపొందించినవే కావడం నాకు మరింత గర్వంగా ఉంది. విజువల్‌గా, సాంకేతికంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ అనుభూతిని అంది స్తుందిఅని తెలిపారు.

'ఈ సినిమాకు మీరందరూ చూపి స్తున్న ప్రేమ, సపోర్ట్, ఎగ్జైట్‌మెంట్ చూసి చాలా ఆనందంగా ఉంది. సినిమా అనేది ఒక కల. ఆ కలను నిజం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. మా దర్శకుడు అభిషేక్ విజన్ ఎంత గొప్పదో ట్రైలర్‌లోనే చూశారు. ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న వ్యక్తి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో తెలుస్తుంది. మన పురాతన ఆలయాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చరిత్రను నెక్స్ట్ జనరేషన్‌కు తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత కిషోర్ ఎంతో ఓర్పుతో, నమ్మకంతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే రథయాత్ర ద్వారా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ రథయాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది అని హీరో విరాట్ కర్ణ చెప్పారు. నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ,”నాగబంధం’తో ఒక గొప్ప సినిమాను రూపొందించాందిఅని తెలిపారు. 'ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మన నాగరికత వారస త్వాన్ని ప్రతిబిం బించే ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది అని నిర్మాత నిశిత నాగిరెడ్డి చెప్పారు.
a

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -