- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విద్యా సంస్థల అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% కోటాను ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను క్యాన్సిల్ చేసింది. 2014 జులైలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ నాటి కాంగ్రెస్-NCP ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ కోర్టు తీర్పుల కారణంగా రిజర్వేషన్ అమలు కాలేదు. ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది. తాజాగా ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.
- Advertisement -



