- Advertisement -
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని యువకుడు మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలలో వేలితే.. ఇబ్రహీంపట్నంలోని బృందావన్ కాలనీలో ఇంట్లో ఉరి వేసుకొని కల్వకోల్ మధుకర్ రెడ్డి(30) రాత్రి మృతి చెందాడు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతిని స్వగ్రామం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.
- Advertisement -



