Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా

ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల సమస్యలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, మండల నాయకులు పనుగంటి బాలయ్య, శ్రీరాములు గ్రామాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. పనుల అమలు, వేతనాల చెల్లింపులు, పనిస్థలాల్లో సౌకర్యాలపై కూలీల నుంచి వివరాలు సేకరించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -