Thursday, February 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలు26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ, బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు, పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -