Sunday, June 21, 2026
E-PAPER
Homeక్రైమ్అప్పుల బాధతో యువకుడు చెరులో దూకి ఆత్మహత్య 

అప్పుల బాధతో యువకుడు చెరులో దూకి ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి
అప్పుల బాధతో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సమీర్ దుబ్బాక సంతలో పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆయనకు ఊర్లో అప్పులు ఎక్కువైనట్టు తెలిపారు. దీంతో సమీర్ చేసిన అప్పుడు ఎలా కట్టాలో తెలియక, చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. వెంటనే గమనించిన స్థానికులు మాకు (100) సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ళతో మృతుడిని బయటకు తీశామని చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -