తిరుపతిలో భారీ జన సందోహం మధ్య ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ మ్యూజికల్ ఫెస్ట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘జిగితార..’ రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రదర్శించిన ‘జిగి తార..’ సాంగ్ అందరినీ ఆకట్టు కుంది. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ,’ఈ పాట సినిమా ప్రారంభమైన 30 నిమిషాలకు వస్తుంది. ఈ పాట మా అందరికీ చాలా స్పెషల్. స్టీవెన్, నివి ఈ సినిమాలో కొన్ని నిమిషాల సేపు మాట్లాడుకునే సీన్స్ ఉంటాయి. ఆ సంభాషణలను ప్రేక్షకులు కనీసం ఐదేళ్ల పాటు మర్చిపోలేరు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందు కోబోతున్నాం’ అని అన్నారు. ‘ఒక మంచి సినిమా చేస్తున్నామనే భావన అందరిలో కలిగింది. ప్రేక్ష కులు మా సినిమాను మర్చిపోరు. వదిలిపెట్టరు’ అని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ చెప్పారు. రచయిత, నిర్మాత సాయి రాజేష్ మాట్లా డుతూ,’ఈ తిరుపతి ఎంత అందంగా ఉంటుందో, మా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లా డుతూ, ”బేబి’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని తపన పడ్డాం. ఆ టైమ్ లో సాయి రాజేష్ చెప్పిన ఈ కథ విన్నప్పుడు నవ్వొచ్చింది. కన్నీ ళ్లు వచ్చాయి. చివరకు ఇదీ మనం చేయాల్సిన సినిమా అనిపించిందిఅని తెలిపారు. 'డైరెక్టర్ రవి రైటింగ్ కు ఎమోషనల్ గా ఫీలయ్యాను. ఈ సినిమాలోని కాన్వర్జేషన్స్ చాలా ఏళ్లు మీకు గుర్తుండిపోతాయి. సాయి రాజేష్ కథ చెప్పినప్పుడు హార్ట్ టచింగ్గా అనిపించింది. ఫ్యాన్స్ గర్వపడేలా సినిమాలు చేస్తాను అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు.
‘బేబి`నిమించి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



