రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫాదర్స్ డే సందర్భంగా చిత్ర బృందం ఓ బ్యూటీఫుల్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ, తన కూతురు నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించడం ఆకట్టుకుంటోంది. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలను ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేసింది. ఈ ఫాదర్స్ డే స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను అలరించిన రవితేజ ‘ఇరుముడి’లో పూర్తిగా భిన్నమైన, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
ఫాదర్స్ డే కానుకగా స్పెషల్ పోస్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


