Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంరణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

రణ్‌వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ రణ్‌వీర్ మేనేజర్ వాట్సాప్ నంబర్‌కు వాయిస్ నోట్ పంపాడని NDTV పేర్కొంది. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికాలోని ఆ నంబర్, మరింత సమాచారం కోసం అమెరికా పోలీసులతో సంప్రదింపులు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా హీరోకు భద్రతను పెంచనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -