నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవో విడుదల చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4న విడుదల చేసిన మునుపటి ఉత్తర్వులకు సవరణగా ఈ కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..జ్యూరీ కమిటీ చైర్మన్‌గా తమ్మారెడ్డి భరద్వాజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



