Saturday, February 21, 2026
E-PAPER
Homeఆటలుసీఎం కప్‌ పోటీలు షురూ

సీఎం కప్‌ పోటీలు షురూ

- Advertisement -

హైదరాబాద్‌ : సీఎం కప్‌ రాష్ట్ర పోటీలు అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీల అనంతరం 21,500 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. 44 క్రీడాంశాల్లో జరుగుతున్న పోటీలను శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి లాంఛనం గా ప్రారంభించారు. ఆరంభ వేడుకలకు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. స్పోర్ట్స్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, శాట్జ్‌ ఎండీ సోనిబాలా దేవి, ఒలింపియన్‌ ఇషా సింగ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -