Thursday, April 23, 2026
E-PAPER
Homeఆటలుకదం తొక్కిన బౌలర్లు

కదం తొక్కిన బౌలర్లు

- Advertisement -

– మొహిసిన్‌, షమీ, ప్రిన్స్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు
– లక్నోపై రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలన విజయం
లక్నో :
ఐపిఎల్‌ సీజన్‌-19లో తొలిసారి బౌలర్ల హవా నడిచింది. లక్నోలోని ఏక్నా క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత లక్నో బౌలర్లు సమిష్టిగా చెలరేగగా.. ఆ తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లు మెరిసారు. దీంతో రాజస్తాన్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు 119పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఛేదనలో భాగంగా లక్నో 11 పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఓపెనర్‌ మిఛెల్‌ మార్ష్‌(55) అర్ధసెంచరీతో మెరిసినా… పూరన్‌(22), హిమ్మత్‌ సింగ్‌(15) కాస్త ఫర్వాలేదనిపించారు. లోయర్‌ ఆర్డర్‌కి తోడు ఆయుష్‌ బడోని, పంత్‌, మార్‌క్రమ్‌, మెహిసిన్‌ ఖాన్‌ డకౌట్లయ్యారు. జోఫ్రా ఆర్చర్‌కు మూడు, బర్గర్‌, బ్రిజేష్‌ శర్మకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ గెలుపుతో రాజస్తాన్‌ జట్టు 40 పరుగుల తేడాతో గెలిచి 2వ స్థానానికి ఎగబాకింది. తొలుత లక్నో బౌలర్లు మొహిసిన్‌ యాదవ్‌కి తోడు, షమీ, ప్రిన్స్‌ యాదవ్‌ కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేయగల్గింది. రాజస్తాన్‌ స్టార్‌ బ్యాటర్లు జైస్వాల్‌, సూర్యవంశీ నిరాశపరచగా.. రవీంద్ర జడేజా (43 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. దీంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగారు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే మహమ్మద్‌ షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లోనే మొహిసిన్‌ ఖాన్‌ కూడా వికెట్‌ పడగొట్టడంతో రాజస్థాన్‌ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత కూడా లక్నో బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రాజస్థాన్‌ బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఒక దశలో రాజస్థాన్‌ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మయాంక్‌ యాదవ్‌ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. జడేజా మెరుపులతో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మొహిసిన్‌ ఖాన్‌, షమీ, ప్రిన్స్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
రాజస్తాన్‌ రాయల్స్‌: జైస్వాల్‌ (సి)పంత్‌ (బి)షమీ 22, సూర్యవంశీ (సి)దిగ్వేష్‌ సింగ్‌ (బి)మొహిసిన్‌ ఖాన్‌ 8, ధృవ్‌ జురెల్‌ (సి)పంత్‌ (బి)షమీ 0, రియాన్‌ పరాగ్‌ (సి)పూరన్‌ (బి)ప్రిన్ష్‌ యాదవ్‌ 20, హెట్‌మైర్‌ (సి)ప్రిన్ష్‌ యాదవ్‌ (బి)మొహిసిన్‌ ఖాన్‌ 22, జడేజా (నాటౌట్‌) 43, ఫెర్రెరా (సి)మొహిసిన్‌ ఖాన్‌ (బి)ప్రిన్ష్‌ యాదవ్‌ 20, శుభమ్‌ దూబే (నాటౌట్‌) 19, అదనం 5. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 159 పరుగులు.
వికెట్ల పతనం: 1/32, 2/32, 3/32, 4/62, 5/77, 6/110
బౌలింగ్‌: షమీ 4-0-30-2, ప్రిన్ష్‌ యాదవ్‌ 4-0-29-2, మొహిసిన్‌ హాన్‌ 4-1-17-2, మయాంక్‌ యాదవ్‌ 4-0-56-0, దిగ్వేష్‌ సింగ్‌ 4-0-26-0.
లక్నో సూపర్‌జెయింట్స్‌: మిఛెల్‌ మార్ష్‌ (సి)రియాన్‌ పరాగ్‌ (బి)బర్గర్‌ 55, బడోనీ (రనౌట్‌)రవి సింగ్‌ 0, రిషబ్‌ పంత్‌ (సి)జురెల్‌ (బి)బర్గర్‌ 0, మార్‌క్రమ్‌ (సి)జురెల్‌ (బి)ఆర్చర్‌ 0, పూరన్‌ (సి)ఫెర్రెరా (బి)జడేజా 22, హిమ్మత్‌ సింగ్‌ (బి)బిష్ణోరు 15, ముకుల్‌ చౌదరి (సి)రియాన్‌ పరాగ్‌ (బి)బ్రిజేష్‌ శర్మ 7, షమీ (బి)బ్రిజేశ్‌ శర్మ 6, మయాంక్‌ యాదవ్‌ (సి)జురెల్‌ (బి)జోఫ్రా ఆర్చర్‌ 5, దిగ్వేష్‌ సింగ్‌ (నాటౌట్‌) 2, మొహిసిన్‌ ఖాన్‌ (బి)జోఫ్రా ఆర్చర్‌ 0, అదనం 7. (18 ఓవర్లలో ఆలౌట్‌) 119పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/10, 3/11, 4/54, 5/91, 6/105, 7/111, 8/113, 9/119, 10/119
బౌలింగ్‌: ఆర్చర్‌ 4-1-20-3, బర్గర్‌ 4-0-27-2, బ్రిజేశ్‌ శర్మ 3-0-18-2, జడేజా 4-9-29-1, బిష్ణోరు 3-0-23-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -