Saturday, February 21, 2026
E-PAPER
HomeNewsT20 World Cup: సూపర్ 8.. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ

T20 World Cup: సూపర్ 8.. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశకు అంపైర్లు, మ్యాచ్ అధికారుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ కీలక దశలో మ్యాచ్ రిఫరీల బృందంలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్‌కు చోటు దక్కింది. కొలంబో వేదికగా నేడు న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగనున్న తొలి సూపర్ 8 మ్యాచ్‌కు రాడ్నీ టక్కర్, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అల్లావుద్దీన్ పాలేకర్ టీవీ అంపైర్‌గా, సామ్ నొగాజ్‌స్కీ ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఫిబ్రవరి 22న భారత్- దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు అనుభవజ్ఞులైన రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ అంపైర్లుగా ఉంటారు. 26న జింబాబ్వేతో మ్యాచ్‌కు అలెక్స్ వార్ఫ్, కెటిల్‌బరో; మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు గఫానీ, వార్ఫ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. భారత్‌కు చెందిన నితిన్ మీనన్ కూడా శ్రీలంకలో జరిగే కొన్ని మ్యాచ్‌లకు అంపైర్‌గా ఎంపికయ్యారు. మొత్తం సూపర్ 8 దశకు రంజన్ మదుగలె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్‌తో పాటు జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీలుగా బాధ్యతలు పంచుకోనున్నారు. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన జట్లు సూపర్ 8లో తలపడనుండటంతో టోర్నీ ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -