- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. దవావో ఒరియెంటల్ ప్రావిన్స్‌లోని మాటి సిటీలో కొండచరియలు ఒక ఇంటిపై కూలిపోవడంతో భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 3 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- Advertisement -



