Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల ఓసపీలో నిర్వాసితులు ఆందోళన.!

తాడిచెర్ల ఓసపీలో నిర్వాసితులు ఆందోళన.!

- Advertisement -

23న మంత్రి శ్రీధర్ బాబుతో భేటి హామీతో విరమణ
నవతెలంగాణ – మల్హర్  రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములు సేకరించాలంటూ శనివారం భూ నిర్వాసితులు ఓసిపి బ్లాక్-1లో ఆందోళన, నిరసన చేపట్టి బైఠాయించారు. తాము ఎనిమిదేళ్లుగా ఓసిపి దుమ్ము,దూళితో నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు. ఓసిపి బ్లాస్టింగ్ దెబ్బలతో తమ ఇండ్లు, ఇంటి గోడలు భారీగా పగుళ్లకు గురికావడంతో తాము భయాందోళనకు గురివుతున్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఓసిపి దుమ్ము,దూళి ఇళ్లలోకి చేరి ఆహార,నిత్యావసర సరుకులపై పడడంతో తాము ఇబ్బందులకు,దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు.

డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల,భూముల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, పునరావాసం కల్పించాలని లేదంటే ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఇటీవల చేపట్టిన ధర్నాలో 20న సమావేశం నిర్వహించి డేంజర్ జోన్ సమస్యను పరిస్కారం చేస్తామని పాలకులు,అధికారులు మాట తప్పారని ఆందోళన చేశారు. ఆందోళన, నిరసన దాదాపు నాలుగైదు గంటపాటు కొనసాగింది.దీంతో ఓసిపి పనులు నిలిసిపోయాయి. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో సంఘటన స్థలం వద్దకు సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ చేరుకొని ఈ నెల 23న సోమవారం మంత్రి శ్రీధర్ బాబుతో నిర్వాసితులు భేటియై సమస్యను పరిస్కారం అయ్యేలా చూస్తామనడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -