Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకలెక్షన్స్ పెరుగుతున్నాయి

కలెక్షన్స్ పెరుగుతున్నాయి

- Advertisement -

హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా ‘దీవాన. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. హీరోయిన్ స్మేహ మణి మేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ సినిమా పరిచయయ్యారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిత మవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ గురించి ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ,'మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'ఏ సర్టిఫికేషన్ వల్ల మా మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ రాలేక పోతున్నారు. ఒక మంచి మూవీ అందరికీ చేరువ కాలేక పోతోంది అనే బాధ మాత్రం మాలో ఉంది. ఈ సినిమా మాకు క్రియేటివ్ గా మంచి సంతృప్తిని మిగిల్చింది. వచ్చే వారంలో ఫైనాన్షియల్ గా కూడా సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం. ఏదేమైనా మేము ఒక మంచి సినిమా చేశామని సంతోషంగా ఉన్నాంఅని తెలిపారు. 'సెన్సార్ అనుకున్న సమయానికి రాకపోవడం వల్ల అనుకున్నవి చేయలేకపోయాం. చిన్న సినిమాకు రిలీజ్ డేట్ మార్చడం ఎంత క్లిష్టమైన పనో మీకు తెలుసు. మా సినిమా యూత్ ఫుల్ మూవీ అనే ఇంప్రెషన్ ఆడియెన్స్ లో మొదట కలిగింది. అయితే మాది హోల్ సమ్ ఫ్యామిలీ మూవీ. ఇందులో లవ్ తో పాటు ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. మేము అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు గానీ రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి అని ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -