దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో మాసాయి ప్రగతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘వేద వ్యాస్. ఇందులో ఒక ప్రత్యేక పాత్ర పోషించిన నటులు, నిర్మాత మురళీమోహన్ కి 86వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఆయన గెటప్ ను రివీల్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, మాజీ శాసన సభ్యులు కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ,'మా చిత్రంలో హైందవ ధర్మ విశిష్టతను చాటే ప్రత్యేక ప్రభోధాత్మక పాత్రలో మురళీమోహన్ నటించారు. భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ను స్వీకరిస్తున్న సందర్భం ఈ పుట్టినరోజే కలిసి రావడం యాదృచ్ఛిక విశేషం. ఈ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి ఆయన అందుకుంటున్న బర్త్ డే గిఫ్ట్ గా భావిస్తూ ఈ రెండు ఆహ్లాదకర సందర్భాలను పురస్కరిం చుకొని మా సాయి ప్రగతి ఫిలిమ్స్ పక్షాన అజాతశత్రువు మురళీమోహన్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇది అలందర్నీ అలరించే సినిమా అని అన్నారు.
కీలక ఆధ్యాత్మిక పాత్రలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



