జ్ఞానమ్మ కలివెల సమర్పణలో సంజన మూవీ మేకర్స్ పతాకం పై విశ్వ, ఐశ్వర్య, అనూష హీరో, హీరోయిన్లుగా వెంకటేష్ కలివెల ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంజన కలివెల నిర్మిస్తున్న సినిమా ‘నా గురించి మీకు తెలియాలి. ఈ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇటీవల ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లు పై చిత్రీకరించిన ముహూర్తము సన్నివేశానికి అమిత్ తివారి క్లాప్ కొట్టగా, కుమారి సంజన కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. వెంకటేష్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు వెంకటేష్ కలివెల మాట్లాడుతూ,'రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ తో సాగే ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఇది. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి. ముఖ్యంగా హీరో 'నా గురించి నీకు తెలియాలి అని చెప్పే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్అని అన్నారు. 'ఈనెలాఖరు నుంచి భీమవరం, నర్సాపురం, అంతర్వేది పరిసర ప్రాంతాలలో ఏకాధాటిగా 34 రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం అని నిర్మాత సంజన కలివెల చెప్పారు. హీరో విశ్వ మాట్లాడుతూ,’నా మొదటి సినిమాకే ఇలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న కథ రావటం అదృష్టంగా భావిస్తున్నానుఅని తెలిపారు. 'ఈ సినిమాలో నేను మీ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను అని హీరోయిన్ ఐశ్వర్య చెప్పారు. మరో హీరోయిన్ అనూష మాట్లాడుతూ, ‘ఇందులో నేను ప్లే చేసే రోల్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను` అని చెప్పారు.
సరికొత్త వినోదాత్మక ప్రేమకథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



