రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది అని తెలిపారు.‘మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. ఇది వన్ మెన్ షో. చివరి 45 నిమిషాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదుఅని దర్శకుడు వైకుంఠ్ బోను చెప్పారు. నిర్మాత త్రినాథ్ కేశవ మాట్లాడుతూ,’ఇది మాకు తొలి చిత్రం. అందరూ అద్భుతంగా నటించారు అని అన్నారు.
భిన్నంగా ‘వసుదేవసుతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



