నవతెలంగాణ జన్నారం : నో అడ్మిషన్.. జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలోని అక్కపల్లిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూలు ప్రారంభమైన 4 రోజులకే 125 మంది చేరారు. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 375 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత సంవత్సరం 250 మంది విద్యార్థులు చదువుకున్నారు. గురువారం ఆ పాఠశాల ముందర నో అడ్మిషన్ అని బోర్డు పెట్టేశారు.ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని ఫ్రీ ప్రైమరీ తరగతి గదిలో దాతల సహకారంతో ఏసీ,ప్రతి తరగతి గదిలో టీవీలు,దిక్సూచి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ఐ భూముల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.డేస్క్ బెంచీలు,మినరల్ వాటర్ ప్లాంట్ తో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తరగతి గదులకు అదనంగా మరో 2 గదులు అవసరం ఉన్నాయి.పాఠశాలలో ప్రస్తుతం హెచ్ఎంతో పాటు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా,అమ్మ ఆదర్శ కమిటి ఆధ్వర్యంలో 6 గురు విద్యా వాలంటీర్లను పనిచేస్తున్నారు.ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఏప్రిల్ లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ. 25 లక్షలు మంజూరు చేశారు.నిర్మాణ పనులు ప్రారంభించవలసి ఉంది.ఈ సందర్భంగా ఆ స్కూల్ హెచ్ఎం,పిన్ల్యాండ్ శిక్షణ పొందిన జాజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి విద్యను అందించడమే తన ధ్యేయమన్నారు.తమ పాఠశాలకు 13 గ్రామపంచాయతీలోని విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. మంజూరైన అదనపు గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.
నో అడ్మిషన్.. ప్రభుత్వ బడిలో పిన్ల్యాండ్లో శిక్షణ పొందిన హెచ్ఎ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



