Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంపశ్చిమ బెంగాల్‌లో కూలిన వేర్‌హౌస్

పశ్చిమ బెంగాల్‌లో కూలిన వేర్‌హౌస్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో డజన్ల కొద్దీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కోల్‌కతాలోని తరతలలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 50 మందిదాకా వర్కర్లు బుధవారం వేర్‌హౌస్‌లో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఉన్నట్టుండి వేర్‌హౌస్ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 7 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గ్యాస్ కట్టర్ల సాయంతో వేర్‌హౌస్ బీమ్‌లను కట్ చేసి మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -