- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : గత రెండు రోజుల క్రితం మండలంలోని శభాష్ నగర్ కు చెందిన బీట్ ఆఫీసర్ సిహెచ్ అనూషకు చెందిన మొబైల్ ఫోన్ మార్గమధ్యంలో పోగొట్టుకోవడం జరిగిందని,దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ని ట్రాక్ చేసి బుధవారం మొబైల్ ని రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు అందించడం జరిగిందని కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు.మండలంలో ఈ విధంగా ఎవరైనా తమ మొబైల్ ఫోన్ ని పోగొట్టుకున్న,దొంగిలించబడినవారు పోలీస్ స్టేషన్ కి సంప్రదించినట్లయితే పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ని ట్రాక్ చేసి వారికి అప్పగించడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.
- Advertisement -



