Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తుకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..

మత్తుకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..

- Advertisement -

– కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్
నవతెలంగాణ-మల్హర్ రావు : యువత మత్తుకు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కొయ్యుర్ ఎస్ఐ మహేందర్ కుమార్ సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో యువత గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా ఉండే విధంగా అవగాహన కల్పించాలని ఉద్దేశంతో గోడపత్రికలను ముద్రించి వాటిని అందరికీ కనిపించే విధంగా అంటించడం జరిగిందని తెలిపారు.మండలంలో ఎవరు కూడా  మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని,ఎవరైనా ఇట్టి అలవాటును మార్చుకోవడం సాధ్యం కానట్లయితే వారు ధైర్యంగా పోలీసు వారిని సంప్రదించవచ్చన్నారు.వారికి వైద్య పరంగా సహాయం పోలీసు వారి ఆధ్వర్యంలో అందించబడతాయని అలాగే ఎవరైనా ఇట్టి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు తెలిసినట్లయితే  సమాచారాన్ని మాకు తెలిపినట్లైతే వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ వారికి నగదు బహుమతి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు.అదేవిధంగా మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తుల పైన  చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -